ఢిల్లీ ప్రజలకు కీలక హెచ్చరిక…ఈ ఏడాది కూడా నిషేధం
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు దీపావళి పండగ వేళ నగరంలో బాణాసంచా పై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా బాణాసంచా కాల్చిన, ఉత్పత్తి, నిల్వలు ఉంచినా వారిపై కఠిన చర్యలు అమలౌవుతాయని హెచ్చరించారు. అయితే గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా గాలి నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. దీన్ని మరింత మెరుగుపరచాలి. అందువల్ల ఈ ఏడాది కూడా బాణసంచాలపై నిషేధం విధించాం. అంతేకాకుండా వీటిని ఉత్పత్తిని పెంచకుండా ఆయా తయారీ కేంద్రాలకు లైసెన్సులను మంజూరు నిలిపివేయాలని ఎన్సీఆర్ రాష్ట్రాలను కోరాం అని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వారికి చట్టప్రకారం రూ.5 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు.













