ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ జనసముహాలకు అనుమతి లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు. మాస్కు ధరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 57కు చేరిందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన డాటాలో తప్పుగా నమోదైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్య కేసలం 54 మాత్రమేనని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టత ఇచ్చారు. బాధితుల్లో ఇప్పటికే 18 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని జైన్ వెల్లడించారు.













