మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆప్ నేత బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ తీర్పు వెలువరించారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 2021`22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అనినీతి జరిగిందని ఆరోపించిన సీబీఐ ఎనిమిది గంటలపాటు సిసోడియాను విచారించిన అనంతరం ఫిబ్రవరి 26న ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.













