కేజ్రీవాల్ కు షాక్… జూలై 3 వరకు కస్టడీ

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును కోరింది. తదుపరి విచారణకు సీఎం కస్టడీ ఈడీ వాదనలు వినిపించింది. అయితే, వాదనలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపడేశారు. ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ యోగ్యత లేనిది అని పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉంటున్నారు.