మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు ఇచ్చింది. ఫిబ్రవరి 17న ఆయన వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇవ్వడంపై ఆప్ స్పందించింది. న్యాయస్థానం జారీ చేసిన ఆర్డర్‌ను అధ్యయనం చేస్తున్నామని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆప్ నేత జాస్మిన్ షా తెలిపారు.













