ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. దీంతో నేడు తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేల బాండ్ సమర్పించాలని స్పష్టం చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.













