కేజ్రీవాల్ కు దక్కని ఊరట… సీఎం అయినంత మాత్రాన
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు లో ఊరట లభించలేదు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అఫ్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన మాత్రాన ప్రత్యేక హక్కులేవి ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు అని వ్యాఖ్యానించింది.













