ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… మావే : క్రేజీవాల్
మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ హామీని మాత్రమే అమలు చేస్తున్నారని, ఉచిత విద్య గురించి ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. అంబేడ్కర్ మరో 15 ఏళ్లపాటు జీవించి ఉంటే దేశంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతో మెరుగుపరిచేవారు. ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య ప్రాధాన్యతను గుర్తించడం లేదు. కొన్ని పార్టీలు ఆఫ్ హామీలను కాపీ కొట్టి పథకాలను అమలు చేస్తున్నాయి. కానీ, ఉచిత విద్య గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఉచిత విద్య హామీ ఆప్ మాత్రమే ఇవ్వగలదు. విద్యారంగ అభివృద్ధికి ఆప్ ఎంతో కృషి చేసింది అని అన్నారు.













