అమర్నాథ్ ఆలయాన్ని దర్శించిన రాజ్‌నాథ్ సింగ్
కశ్మీర్, లడఖ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అమర్నాథ్ ఆలయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాజ్‌నాథ్ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే కూడా అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన ఎల్ఓసీకి సమీపంలోని కుప్వారా జిల్లాలో ఒక ఫార్వార్డ్ పోస్ట్‌ను సందర్శించారు. అక్కడి సైనికులతో ముఖాముఖీ జరిపారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ పర్యటన జరపడం విశేషం.













