సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ఖరారు!
యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసిందా? రాబోయే ఎన్నికల్లో ఆమెను ముందుంచే సమరాంగణలో కాంగ్రెస్ దూకనుందా? అంటే అవుననే అంటున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని అధిష్ఠానం ఫైనల్ చేసిందని, అందుకు ప్రియాంక కూడా అంగీకరించారని కాంగ్రెస్ సీనీయర్ నేత జితిన్ ప్రసాద్ వెల్లడించారు. ఇంతటి వ్యూహాత్మక నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ తీసుకుందని ఆయన తెలిపారు. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను తెరపైకి తెస్తారా? అని ప్రశ్నించినపుడు.. ఇది కార్యకర్తల దర్ఘీకాలిక డిమాండ్. కానీ సీడబ్ల్యూసీ ఈ నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకుంది. ప్రియాంక కూడా ఒప్పుకున్నారు అని జితిన్ ప్రసాద్ పేర్కొన్నారు.













