మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం
మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మైసూరు రాజకుటుంబీకులతో కలిసి ముఖ్యమంత్రి యడియూరప్ప చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాదీ ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం ఈసారి కరోనా విస్త•తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. జనసమ్మర్థానికి తావులేకుండా ఉత్సవాలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మైసూరు పరిసర ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి ఎక్కువడా ఉండటంతో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. 10 రోజులపాటు నిర్వహించే ఈ దసరా ఉత్సవాలు కర్ణాటక సంస్క•తికి, రాజసానికి అద్దం పడతాయి. రాజప్రసాదం, చాముండేశ్వరి ఆలయం విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతాయి. 15వ శతాబ్దం నుంచే విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది.













