జడేజా సతీమణికి బీజేపీ టికెట్ ?
గుజరాత్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ఆకర్షిస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టేందుకు ఆప్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కమలం పార్టీ ఖరారు చేయనుంది. ఆ నిమిత్తం పార్టీ కేంస్రద ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాగా ఈ అభ్యర్థుల తుది జాబితాలో టీమిండియా క్రికెట్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది. ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రీవాబా జడేజా మెకానికల్ ఇంజినీర్. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. రాజ్పుత్ వర్గానికి చెందిన కర్ణిసేవ నాయకురాలైన ఈమె మూడు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. ప్రముఖ రాజకీయనేత హరి సింగ్ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు. గుజరాత్లో రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా దానిని నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.













