మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా?.. అయితే గుడ్ న్యూస్

మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన్ వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. మీరు ఆన్‍లైన్ లోనే ఇంట్లో నుంచే వివరాలను నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ విదేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో మీ పాస్ పోర్ట్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు అని ఆరోగ్య సేతు యాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది.