దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఒకే సారి 38 మందికి
గుజరాత్ అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును ప్రకటించింది. ఇలా ఇంత మందికి ఒకేసారి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2008లో అహ్మదాబాద్‌లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. 70 నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. విచారణ ప్రారంభంలోనే ఒక నిందితుడు అఫ్రూవర్‌గా మారడంతో మిగిలిన వారిపై కోర్టులో విచారణ కొనసాగింది. సూరత్, అహ్మదాబాద్ సహా పలు చోట్ల వేర్వేరుగా 35 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఒకటిగా విచారించారు. ఈ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది. వారిలో 38 మందిని కీలక దోషులుగా ప్రకటించింది. నేరారోపణలు రుజువు కావడంతో వారికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.













