ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. నిందుతులకు బెయిల్ నిరాకరణ
ఢిల్లీ మద్యం కుంభకోణం మానీలాండరింగ్ వ్యవహారంలో నిందితుల బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, వినోయ్ బాబు, విజయ్ నాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని, బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు వినిపించింది. తాజాగా సౌత్ గ్రూప్ నుంచి మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశామని వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఈడీ వివరించింది. నిందితులకు బెయిల్ ఇస్తే ఇతర సాక్షకులను, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. ఈడీ విజ్ఞప్తి మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.













