తేజస్వీ యాదవ్ కి ఊరట…
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తేజస్వీ యాదవ్ బెయిల్‌ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. బహిరంగంగా మాట్లాడే సమయంలో బాధ్యతగా నడుచుకోవాలని, ఆచితూచి మాట్లాడాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ గీతాంజలి గోయెల్ హెచ్చరించారు. కేసును దర్యాప్తు ప్రభావితం చేసేందుకు తేజస్వీ ప్రయత్నిస్తున్నారని, మీడియా సమావేశంలో అధికారులను బెదిరించారని ఆరోపించింది. తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారంటూ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది.













