మాజీ సీఎం వసుంధరకు మంచి రోజులు
మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత వసుంధర రాజే సింధియాకు తిరిగి మంచిరోజుల వచ్చాయి. ఈమె నిర్ణయంలో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను తిరిగి రాష్ట్ర కోర్ కమిటీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులుగా అధిష్ఠానం, సింధియాకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ ఆమెను పక్కన పెట్టేసింది. ఆమెతో పాటు ఆమె వర్గీయులను కూడా పక్కన పెట్టేసింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఎక్కడా ఈ ఆగ్రహాన్ని ప్రదర్శించకపోవడం గమనార్హం. గెహ్లాట్ ప్రభుత్వం పతన అంచున వరకు వెళ్లినా… సింధియా క్రియాశీలం కాలేదు. కనీసం ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. దీంతో ఆమె వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె లోపాయికారీగా గెహ్లాట్‌కు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఏకంగా ఆమెకు మద్దతుగా ఓ పార్టీనే స్థాపిస్తున్నామని ఆమె వర్గీయులు ప్రకటించారు. దీంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాతే ఆమెను తిరిగి కోర్ కమిటీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఈ నిర్ణయం తీసుకుందని అధిష్ఠానం ముఖ్యులు పేర్కొంటున్నారు.
ఈమెతో పాటు మరో 16 మందిని కూడా…
మాజీ సీఎం వసుంధరతో పాటు మరో 16 మందిని కూడా బీజేపీ కోర్ కమిటీలోకి తీసుకుంది. వీరితో పాటు 93 మందిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. దీంతో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఇందులో అత్యధికులు సింధియా వర్గమే.













