85 ఏళ్ల చరిత్రలో.. ఇదే తొలిసారి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్‍లో ఓ తెల్ల నెమలి అటవీ సిబ్బందికి కనిపించింది. కార్బెట్ టైగర్ రిజర్వ్లోని కోతి రౌ సమీపంలో పెట్రోలింగ్‍కు వెళ్లిన అటవీ అధికారులకు ఈ దృశ్యాలు కంటపడ్డాయి. వాస్తవానికి కార్బెట్ రిజర్వ్లో బ్లూ కలర్ నుంచి గ్రీన్ వరకు అన్ని రకాల నెమలిలకు నిలయం. కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక్క తెల్ల నెమలి కూడా చూడలేదు. అయితే గత 85 సంవత్సరాల చరిత్రలో కార్బెట్ రిజర్వ్లో తెల్ల నెమలి కనిపించడం ఇదే తొలిసారి. దీంతో నిజంగా వారు చూసింది తెల్ల నెమలియేనా అని తెలుసుకునేందుకు మరుసటి రోజు అక్కడికి వెళ్లారు. మళ్లీ ఆ నెమలి తారసపడంతో నిర్ధారించుకున్నట్లు రిజర్వ్ డైరెక్టర్ రాహుల్ తెలిపారు. అనంతరం జోన్‍లోని సిబ్బందిని అప్రమత్తం చేసి, ఇలాంటి నెమలిలు ఇంకా ఉన్నాయో లేవో గుర్తించేందుకు దాని కదలికలపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.