కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు.. ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆఫర్
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందన్నారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆశ చూపి, ఏడుగురు ఎమ్మెల్యేలు కొనుగోలుకు కుట్ర పన్నిందని విమర్శలు చేశారు. బీజేపీ వారు ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను సంప్రదించారు. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్ అరెస్టు అవుతారు. ఎమ్మెల్యేలను విడగొట్టొచు. 21 మందితో చర్చలు జరిపాం. మరికొంతమందితోనూ మాట్లాడాం. తర్వాత మేం ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా రావొచ్చు. రూ.25 కోట్లు ఇస్తాం. బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని మా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. నన్ను అరెస్టు చేసేది మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు కాదని దీనిని బట్టి అర్థమవుతోంది. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నుతున్నారు. గత 9 ఏళ్లలో వారు ఇలాంటి ప్రయత్నాలు ఏన్నో చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రజలు మద్దతు ఎప్పుడూ మాకే. మా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించారు. ఈసారి కూడా వారి కుట్రలు భగ్నమవుతాయి అని ఆరోపించారు.













