రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి విధానం అమలు చేస్తున్నరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గే.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకున్నారు. దీనికోసం శనివారం నాడు ఈ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి కోసం మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేసులో ఉన్నట్లు సమాచారం.













