అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలు : శశిథరూర్
2024 లోక్సభ ఎన్నికల్లో చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో తిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు. రానున్న లోక్సభ ఎన్నికలే తిరువనంతపురం నుంచి తన చివరి ఎన్నికలని అంటూ యువ రాజకీయనేతలకు మార్గం సుగమం చేయడాన్ని తాను నమ్ముతాననని అన్నారు. అయితే రాజకీయ కెరీర్లో ఎప్పుడూ ఊహించనివి జరుగుతుంటాయని అంగీకరించారు. ఇవే నా చివరి ఎన్నికలని ఆయన విస్పష్ట సంకేతాలు పంపారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తిరువనంతపురం ప్రజలకు 20 ఏండ్ల సేవలు పూర్తవుతాయని అప్పుడు సంతోషంగా తప్పుకుంటానని తెలిపారు. అయితే రాజకీయాల్లో ఇదే ఖరారని చెప్పలేమని, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎవరికీ తెలుసని అన్నారు. తిరువనంతపురం నుంచి తాను పోటీ చేయడంపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తేనే తాము పనిచేసుకుంటామని వెల్లడిరచారు.













