గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు.. ఆప్ వల్ల నష్టపోయాం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీనే ఇచ్చింది. ఈ వైఫల్యం గురించి కాంగ్రెస్ కీలక ఎంపీ శశిథరూర్ స్పందించారు. ‘గుజరాత్ ఎన్నికల్లో నేను ప్రచారం చేయలేదు. పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో కూడా లేను. కాబట్టి ఈ ఫలితాలపై ఎక్కువ మాట్లాడలేను’ అని థరూర్ అన్నారు. అదే సమయంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసొస్తుందని భావించినట్లు థరూర్ వెల్లడించారు. అయితే హిమాచల్లో మాత్రమే తమ అంచనా ఫలించిందని, గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని వివరించారు. ఇక్కడ ఆప్ తమను దెబ్బతీసిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిందని అభిప్రాయపడ్డారు.













