కాంగ్రెస్‌కు నా అవసరం లేదు
కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీకి తన అవరం లేదని స్పష్టం చేశారు. తనంతట తాను పూర్వ వైభాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఎన్నో అంశాల్లో తనకు అధిష్టానానికి మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. అయితే అవన్నీ ఆ పార్టీ తనంతట తానే చేసుకోగలదని, ఎందరో తలపండిన నాయకులు ఆ పార్టీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, అందుకే పార్టీలోకి తనని రమ్మని ఆహ్వానించినా తిరస్కరించానని తెలిపారు. కాంగ్రెస్ ఎలాంటి పాత్రా పోషించాలని తాను అనుకోలేదని, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అనుకుంటే కచ్చితంగా అమలు చేసి తీరాలని ఆదేశించానని తెలిపారు. కాంగ్రెస్‌కి ఏం చెప్పదలచుకున్నానో అది చెప్పేశాను అని అన్నారు.













