అయోధ్య నుంచి కాదు గోరఖ్పూర్ నుంచే యోగి
అయోధ్య నుంచి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలో దిగుతారని బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి ధర్మేంద్రప్రధాన్ యూపీలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. తొలుత అయోధ్య, మధుర స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి యోగి పోటీ చేస్తారని తెలిసింది. చివరికి గోరఖ్పూర్ అర్భన్ స్థానం ఖరారైంది. యూపీ అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి. యూపీలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 58 సీట్లకుగానూ 75 మంది, రెండో విడతలో 55 స్థానాలకు గాను 48 మంది పేర్లను తొలి జాబితాలో ప్రకటించారు. ఈ జాబితాలో 63 మంది సిట్టింగ్ ఎమెల్యేలు ఉన్నారు.













