మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ
బెంగళూరు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. బెంగళూరు చేరుకున్న కేసీఆర్ నేరుగా దేవెగౌడ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. లంచ్ అనంతరం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమరస్వామితో కేసీఆర్ చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించినట్లు తెలుస్తోంది.













