న్యాయవాదులకు ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసిన సీజేఐ

న్యాయ వ్యవస్థలో విధులు నిర్వర్తిస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రానికి సూచించారు. ఈ మేరకు రమణ కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు. న్యాయ స్థానాల సిబ్బందికి వ్యాక్సిన్ కూడా ఇచ్చేలా చూడాలని లేఖలో కోరారు. కోవిడ్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలని కూడా కోరారు. హైకోర్టుల్లో జడ్జీల ఖాళాలను తొందరగా భర్తీ చేసేందుకు కొలీజియం సిఫార్సులపై తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ లేఖలో కేంద్రాన్ని కోరారు.