తెలుగు ప్రజల అభిమానం మరువలేను : జస్టిస్ ఎన్.వి.రమణ
తెలుగు ప్రజల ఆశీర్వాదబలమే తనను ఈ స్థాయికి చేర్చిందని సీజేఐ ఎన్.వి.రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలి. అబ్బాయ్ రమణ అంటూ మా ఊరు పొన్నవరంలో పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది. తెలుగు ప్రజలు చూపిన అపారమైన ప్రేమాభిమానాలు నేనే, నా కుటుంబ సభ్యులు ఎప్పటికి మర్చిపోలేం అని అన్నారు. తన పర్యటనకు సహరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్.వి.రమణ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తేనేటి విందు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.













