అభినందనలు తెలిపిన వారందరికీ…
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దేశం నలుమూలల నుంచి అభినందనలు తెలిపిన వారందరికీ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి అత్యున్నత రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నవారి వరకు ఎంతోమంది అభినందించారు. వారందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలో తనకు అన్ని వర్గాల నుంచి సహకారం అందుతుందనే ఆశాభావం, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అని పేర్కొంది.













