తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వద్దకు చేరుకున్న సీజేఐకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ అలిపిరి చేరుకుని సప్త గో ప్రదక్షిణశాలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి గో ప్రదక్షిణశాల, వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.













