ఇండియా కన్నా పాక్ వద్దే ఎక్కువ
గత ఏడాది కాలంలో భారత్, చైనా తమ అణ్వాయుధాలను గణనీయంగా పెంచుకున్నాయని స్వీడన్‌కు చెందిన మేధోసంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) వెల్లడించింది. అయితే, భారత్ కంటే చైనా, పాకిస్థాన్ వద్దే అణ్వస్త్రాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. చైనా సుమారు 320 న్యూక్లియర్ వార్‌హెడ్ లను కలిగి ఉండగా, భారత్ వద్ద 150, పాకిస్థాన్ వద్ద 160 వార్హెడ్లు ఉన్నట్లు తన ఇయర్ బుక్ 2020లో వివరించింది. మరోవైపు, 2019లో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. ప్రపంచ అణ్వాయుధాల్లో 90 శాతం వాటా కలిగిన అమెరికా, రష్యా, కాలంచెల్లిన తమ న్యూక్లియర్ వెపన్లను ధ్వంసం చేయడమే ఇందుకు కారణమని తెలిపింది.













