హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్లో డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢల్లీి నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో రావత్ సహా హెలికాప్టర్లో ఉన్నవారంతా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.













