ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక
ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో గల మనోహర్ గోశాల నిర్వాహకులు గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ రూపొందించారు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో తయారు చేసిన ఈ తివాచీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా పంపనున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. 14 కిలోలకు పైగా బరువు ఉన్న దీన్ని తయారు చేయడానికి సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవుపేడ, మూత్రాన్ని వినియోగించాం. గోల్డెన్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన ఈ రకం ఆవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. త్వరలోనే ఢిల్లీలోని ప్రధాని నివాసానికి ఈ తివాచీని పంపుతాం అని మనోహర్ గోశాల మేనేజింగ్ ట్రస్టీ పాదం డాక్లియా తెలిపారు.













