కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్
ఛత్తీస్గఢ్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తుల లాగానే కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయి, శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు సాధారణమే. ఈ నమ్మకాన్ని ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్థన్ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటారు.













