కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
ఛత్తీస్గఢ్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామం లో గోవర్ధన్ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తుల లాగానే కొరడా దెబ్బలు తిన్నారు. తన చేతిపై ఐదు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయి, శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు సాధారణమే. ఈ నమ్మకాన్ని ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటారు.













