ఆప్ సర్కారు కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. బహిరంగ ప్రదేశాల్లో ఛట్ పూజలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాలు, దేవాలయాలు, ఘాట్లలో ఛట్ పూజా కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీ వాసులంతా ఇంట్లోనే ఉండి పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల సందర్భంగా మేళాల నిర్వహణ, ఫుడ్ స్టాల్స్, ర్యాలీలు, ఊరేగింపులకు సైతం అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా పటాకుల విక్రయాలు, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.













