ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తెలుగువారు : చంద్రబాబు
ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రైతు కుటుంబలో పుట్టి, ఐటీని ప్రోత్సహించా. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేఐస్తానన్నప్పుడు, విజన్`2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే అని అన్నారు.













