మోదీ నామినేషన్ కు చంద్రబాబు, పవన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మోదీ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ సోవారమే వారణాసికి చేరుకున్నారు. చంద్రబాబు నేడు హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్లారు.