జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం
రాజకీయ వేడి రాజుకున్న జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరెన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సీఎం పదవి చేపట్టారు.













