ట్విటర్ కు కేంద్రం ఝలక్…
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. రైతుల ఆందోళనలపై రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్న 1178 పాకిస్థాన్, ఖలిస్థాన్ ట్విటర్ అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ట్విటర్ మాత్రం 500 వరకు మాత్రమే తొలగించింది. మిగతా వాటిని భావప్రకటన స్వేచ్ఛ పేరుతో తొలగించడం లేదని చెప్పింది. దీనిపై తాజాగా ప్రభుత్వం స్పందించింది. ట్విటర్‌కు ఇండియాలో ప్రత్యర్థి అయిన క్యూ (koo) లో కౌంటర్ ఇచ్చింది. ట్విటర్ స్పందన అసహజంగా ఉన్నదని కేంద్రం అభిప్రాయపడింది. ప్రభుత్వంతో సమావేశం కావాలన్న ట్విటర్ ప్రతిపాదనను ఐటీ శాఖ కార్యదర్శి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్విటర్ సీనియర్ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు. దీనికి ముందు ట్విటర్ స్పందన అసహజంగా ఉంది. ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పందిస్తుంది అని కూలో ప్రభుత్వం రిప్లై ఇచ్చింది.













