షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్.. సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల నిర్వహణకు విధివిధానాలపై కసరత్తు సాగుతోంది. జులై నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఆశిస్తున్నానని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో వర్షాకాల సమావేశాలు యధావిధిగా జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలువురు ఎంపీలు, ఉభయ సభల సిబ్బందిలో చాలావరకూ కరోనా వ్యాక్సిన్ కనీసం సింగిల్ డోసు తీసుకోవడంతో సమావేశాల నిర్వహణపై అధికారులు విశ్వాసంతో ఉన్నారు.