తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు పై… కేంద్రం క్లారిటీ
తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి సృష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఆంధ్రప్రదేశ్లో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.













