అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించిది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్`మే లో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.













