ఆంక్షలు తొలగిస్తున్నారు… జాగ్రత్త సుమా… : రాష్ట్రాల తీరుపై కేంద్రం ఆందోళన

ఆయా రాష్ట్రాలు భారీగా ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ పరిస్థితులను పూర్తిగా గమనంలోకి తీసుకున్న తర్వాతే తగు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆంక్షలను సడలించడం వల్ల మార్కెట్లు, ఇతరత్రా ప్రదేశాల్లో ప్రజలు తీవ్రంగా గుమిగూడే అవకాశం ఉందని, రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిబంధనల విషయంలో ఏమాత్రం సంతృప్తి పడకూడదని పేర్కొంది. టెస్టింగ్, ట్రాకింగ్, వైద్యం, వ్యాక్సిన్ విషయాలపై నిరంతర అప్రమత్తతతో ఉంటూ ఆంక్షలను సడలించాలని సూచించింది. పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.