ఎన్నికల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్ సహా ఉప ఎన్నికలు జరుగనున్న 12 రాష్ట్రాలో కరోనా నిబంధనలను కేంద్ర హోంశాఖ సడలించింది. బీహార్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా, జార్ఖండ్, చత్తీస్గఢ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చని సూచించింది. సెప్టెంబర్ 30న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 15 వరకు ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించటానికి వీలు లేదు. బీహార్లో మొదటి విడత పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.













