తెలంగాణకు అయిదుగురు… ఏపీకి నలుగురు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అయిదుగురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు కొత్తగా ఐపీఎస్ అధికారులను కేటాయించింది. 2020లో సివిల్ సర్వీస్‌లో పరీక్షల్లో నెగ్గి ఐపీఎస్‌కు ఎంపికైన 200 మందిలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం తొమ్మిది మంది దక్కారు. తెలంగాణకు అనినాశ్ కుమార్, కాజల్, కంకణాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, సురుకొంటి శేషాద్రిణిరెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చల్లపల్లె యశ్వంత్ రెడ్డి, దీక్ష, నవజ్యోతి మిశ్ర, సురణ అంకిత మహావీర్ కేటాయించారు.
రెండు రాష్ట్రాలకు చెందిన 10 మందిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేటాయించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ రూల్స్ 1954(1) కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 200 మంది అధికారులకు వివిధ రాష్ట్రాలకు క్యాడర్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబరు నాటికి ఉన్న ఖాళీలను అనుసరించి ఈ కేటాయింపులు జరిపింది.













