కొత్త పార్టీపై కెప్టెన్ అమరీందర్ సింగ్ క్లారిటీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతగా రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని, ఎన్నికల కమిషన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించగానే పార్టీ పేరు, ఎన్నికల గుర్తును నిర్ధారిస్తానని వెల్లడిరచారు. కొత్త పార్టీ పేరుపై ఇంకా స్పష్టత రాలేదని ఎన్నికల గుర్తుపై ఈసీ నుంచి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. దీనిపై తమ న్యాయవాదులు కసరత్తు సాగిస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రకటన తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తమ పార్టీలో చేరతారని తెలిపారు. నవజోత్ సింగ్ సిద్ధూ ఎక్కడ పోటీ చేసినా తాము దీటుగా నిలువరిస్తామని అన్నారు.













