మహారాష్ట్ర గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ ?
పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్‌గా పని చేసేస్తున్న బీఎస్ కొశ్యారీ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకోగా తన శేష జీవితాన్ని పుస్తకాలు చదువుతూ, రచిస్తూ గడపాలనుకుంటున్నాని ఆయన ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కొనసాగుతున్న కెప్టెన్ అమరీందర్‌ను నియమించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.













