యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి (30) చెందింది బెంగుళూరు సెంట్రల్ బిజినెస్ జిల్లాలోని వసంత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసును అనుమానాస్పద మృతి పోలీసులు రిజస్టర్ చేసుకున్నారు. కాగా, ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్పాడినట్లు తెలుస్తోంది. యడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్ నీరజ్‌తో 2018లో ఆమెకు వివాహం జరగ్గా, నాలుగు నెలల పాప కూడా ఉంది. వృతిరీత్యా సౌందర్య డాక్టర్. ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె పనిచేస్తోంది. అయితే, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ దొరకలేదు. సౌందర్య కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయినందున వారిని తాము ప్రశ్నించ లేకున్నామని, అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత కేసు సమగ్ర దర్యాప్తు జరుపుతామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్‌ఫామ్ హౌజ్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.













