రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ కే కేశవరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసన ఉంటుంది. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్లో ఎండగడుతాం. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పాం అని కేకే పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం. అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ హాల్లో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది.













