లక్కీ పెండ్లి కూతురు..!
జీవితంలో పెండ్లి అంటేనే మరచిపోలేని వేడుక. అలాంటి పెళ్ళిలో విజయం కూడా వరిస్తే చెప్పాల్సిన అవసరం లేదు. యుపిలో ఈ మధురమైన సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు పూనమ్ పెండ్లి నాడే (మే 2న) స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఓవైపు బంధుమిత్రులతో ఓ వివాహ వేదిక కళకళలాడుతున్నది. పెండ్లి కూతురు, పెండ్లి కుమారుడు వేదికపైకి వచ్చారు. జిలకర బెల్లం పెట్టుకోవడం, పెండ్లి కూతురు మెడలో పెండ్లి కొడుకు తాలి కట్టడం పూర్తయింది. ఆ సమయంలో ఎన్నికల అధికారుల నుంచి పెండ్లి కూతురు పూనమ్‌కు పిలుపు వచ్చింది. ఎందుకంటే పూనమ్ రాంపూర్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీచేయడంతో ఆమె పెండ్లి నాడే (మే 2న) ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పూనమ్ విజయం సాధించింది. దాంతో గెలుపు ధృవీకరణ పత్రం అందుకోవాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. దాంతో ఆమె పెండ్లి పీటల పైనుంచే నేరుగా పెండ్లి బట్టలతోనే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లింది.రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని స్వీకరించి తిరిగి పెండ్లి వేడుకకు హాజరయ్యింది.













